: 'మంగళ్యాన్' సెంచరీ


భారత్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 'మంగళ్యాన్' వంద రోజులు పూర్తి చేసుకుంది. అంగారక గ్రహంపైకి ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మంగళ్యాన్' ఇప్పటివరకు 190 మిలియన్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. గతేడాది నవంబర్ 5న ప్రయోగించిన ఈ మిషన్ అరుణ గ్రహ వాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో మరో 680 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఇందుకు మరో 210 రోజులు పడతాయని తెలుస్తోంది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ 'మంగళ్యాన్' గమనాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ మిషన్ సాఫీగా సాగుతోందని, ఎలాంటి సమస్యలు లేవని ఇస్రో వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News