: స్మార్ట్ ఫోన్ల దెబ్బకు పీసీలు విలవిల
స్మార్ట్ ఫోన్లతో వైకుంఠమే అరచేతికి అందివస్తే.. ఇక పీసీల మొహం చూసేదెవరు? ఇదే పరిస్థితి విక్రయాలలో కనిపిస్తోంది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే భారత్ లో కంప్యూటర్ల విక్రయాలు 19.9శాతం తగ్గిపోయినట్లు గార్ట్ నర్ రిపోర్టు తెలియజేస్తోంది. ఈ కాలంలో 19.6లక్షల కంప్యూటర్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇదే కాలంలో స్మార్ట్ ఫోన్లు 1.28కోట్లు, 26.6లక్షల టాబ్లెట్లు అమ్ముడుపోయి ఉంటాయని అంచనా. ఇక నోట్ బుక్ విక్రయాలు కూడా పీసీల వలే 27 శాతం క్షీణించాయి.