: ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించిన ఖర్గే.. లోక్ సభ రేపటికి వాయిదా
మధ్యంతర రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న మంత్రి మల్లికార్జున ఖర్గే తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించడంతో లోక్ సభ రేపటికి వాయిదా పడింది. సభలో సభ్యుల ఆందోళనల కారణంగా రైల్వే బడ్జెట్ ను సభకు సమర్పిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. సభలో తీవ్ర నినాదాలు, నిరసనల కారణంగా కేవలం పది నిమిషాలే మంత్రి ఖర్గే బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు.