: ఉభయసభలను హోరెత్తిస్తున్న సీమాంధ్ర ఎంపీలు


సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు ఉభయసభలను నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రెండు వాయిదాల అనంతరం ప్రారంభమైన ఉభయసభలను సీమాంధ్ర ఎంపీలు అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభ వెల్ లోకి దూసుకెళ్లి ఛైర్మన్ కనబడకుండా ప్లకార్డులో ప్రదర్శించి నినాదాలు చేసి సభను అడ్డుకోగా, లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిన్నటి వరకూ లేని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా లోక్ సభలో నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News