: మదర్ మేరి విగ్రహం కంట్లోంచి కన్నీరు
క్రైస్తవుల ఆరాధ్యదైవం ఏసుక్రీస్తు తల్లి మదర్ మేరి విగ్రహం నుంచి కన్నీరు కారడం భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఇజ్రాయిల్ లో కోరియస్ అనే ఆమె గత ఏడాది మదర్ మేరి విగ్రహాన్ని కొని తెచ్చుకుని పూజిస్తోంది. గత కొన్ని రోజులుగా విగ్రహం కంట్లోంచి నీరు రావడం కోరియస్ గమనించింది. దీనిని చుట్టుప్రక్కల వారితో చెప్పింది. వారువచ్చి అది నీరు కాదని తైలం అని గ్రహించారు. విషయం చుట్టుప్రక్కల వ్యాపించడంతో వింతను చూసేందుకు భారీ సంఖ్యలో క్రైస్తవులు కోరియస్ ఇంటికి తరలి వస్తున్నారు. ఫోటోలు తీసుకుని మురిసిపోతున్నారు. మేరీమాత ఇలా తమ ఇంట అద్భుతం చూపించినా, కన్నీరు రావడం పట్ల ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది విజయనగరం జిల్లా పార్వతీపురంలో హిందూ మతానికి చెందిన వ్యక్తి ఇంట్లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.