: కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం.. పది మంది మృతి


కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ సమీపంలో ఈరోజు (బుధవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ - ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగి పది మంది వరకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో సంఘటనా స్థలి భీతావహంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News