: ఛార్జిషీటు నుంచి నా పేరు తీసేయరూ...!: విజయసాయి పిటిషన్


జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డి.. రెండో ఛార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలని నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

ఇక, జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు ఎమ్మార్, ఓఎంసీ నిందితుల రిమాండ్ ను కూడా ఏప్రిల్ 1వరకు పొడిగించారు. జగన్, మోపిదేవి వెంకట రమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, సునీల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులకు రిమాండ్ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 


  • Loading...

More Telugu News