: పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. లోక్ సభ గంటపాటు వాయిదా
పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదలైన వెంటనే ఇరు సభల్లో సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ వెల్ ల్లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. దాంతో, చేసేదిలేక స్పీకర్ మీరాకుమార్ వెంటనే లోక్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ సీమాంధ్ర ఎంపీలు కేవీపీ, సీఎం రమేశ్, సుజనా చౌదరి ఛైర్మన్ వెల్ లో న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.