: సీమాంధ్ర నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలి: హరీశ్ రావు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. వారికి, టెర్రరిస్టులకు మధ్య తేడా లేదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వారి పట్ల డీజీపీ ప్రసాదరావు వివక్ష చూపిస్తున్నారని, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News