: పెళ్లి చేసుకుంటున్న మీరా జాస్మిన్
'పందెంకోడి', 'భద్ర','గుడుంబా శంకర్', 'అమ్మాయి బాగుంది'.. వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక మీరా జాస్మిన్ ఈ రోజు పెళ్లి కూతురు కాబోతుంది. దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను మీరా తిరువనంతపురం పాలయంకోట్టైలో గల ఎల్ ఎంఎస్ చర్చిలో వివాహం చేసుకోనుంది. అయితే, మీరా, అనిల్ మొన్న (సోమవారం) సాయంత్రం 8.30 గంటలకు చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని, రిజిస్టర్ అధికారి సమక్షంలో సంతకాలు చేసి పూలదండలు మార్చుకున్నారట. ఆ కార్యక్రమానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.