: బిల్లుకు కుదిరిన ముహూర్తం.. రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం


ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ముహూర్తం కుదిరింది. రేపు (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నిన్న (మంగళవారం) లోక్ సభ స్పీకర్ ఆధ్వర్యంలో జరిగిన సభా వ్యవహారాల సమితి (బీఏసీ) ముందు బిల్లును పెట్టి అనుమతి పొందారు. ఆ తర్వాత పార్లమెంటు ఆవరణంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన కోర్ కమిటీలో కూడా బిల్లుకు తుది ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బిల్లు ప్రతులను లోక్ సభ సచివాలయం ఈ ఉదయం ఎంపీలకు అందజేసింది.

  • Loading...

More Telugu News