: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరకు వెళ్లే మార్గాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హన్మకొండ నుంచి పస్రా వరకు సుమారు 40 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. సారలమ్మ కన్నెపల్లి నుంచి ఈ రోజు మేడారం గద్దెకు చేరుకుంటుంది.