: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నేడు కూడా డీలా పడ్డాయి. కేంద్రంలో యూపీఏ-డీఎంకే వ్యవహారం, భవిష్యత్తులో వడ్డీ రేట్లపై ఆర్ బీఐ కోత ఎలా ఉంటుందోనన్న అనుమానాలతో మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లోనే కొనసాగాయి. దీంతో బీఎస్ఈ సెన్స్ క్స్ 123 పాయింట్లు నష్టపోయి 18,884 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 5,694 వద్ద ముగిసింది.
హిందుస్థాన్ యూనిలివర్ షేరు 3.53 శాతంతో లాభపడగా, టాటా మోటార్, సిప్లా, ఐటిసి లిమిటెడ్, టీసిఎస్ షేర్లు ఒకశాతంతో లాభాల బాటలో నిలిచాయి. ఇక భారతి ఎయిర్ టెల్, ఎస్ బిఐ, ఎన్ టిపిసి, హిందాల్కో, ఓఎన్ జీసీ షేర్లు నష్టాల బాటలో నడిచాయి.