: ఫిక్సింగ్ లో ధోనీ కూడా ఉన్నాడా?


స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఐపీఎల్ ను ఒక్క కుదుపు కుదిపేయగా.. ఇప్పుడు దానిపై దర్యాప్తు జరిపి సుప్రీంకోర్టుకు జస్టిస్ ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదిక కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదికలో ఆరుగురు క్రికెటర్ల పేర్లను కమిటీ పేర్కొన్నట్లు.. ఆ ఆరుగురిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ, సురేశ్ రైనా పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. ధోనీ, రైనాకు ఫిక్సింగ్, బెట్టింగ్ లతో సంబంధం ఉందని బుకీ ఉత్తమ జైన్ అలియాస్ కిట్టీ చెప్పినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తిరుచ్చి రైల్వే ఎస్పీకి కిట్టీ వీరి పేర్లను వెల్లడించినట్లు కూడా జస్టిస్ ముద్గల్ తన నివేదికలో తెలిపారని సమాచారం. టేపుల్లో ఉన్న ఒక స్వరం భారత క్రికెటర్ దేనని ఒక క్రీడా విలేకరి గుర్తు పట్టినట్లు కూడా నివేదించినట్లు తెలుస్తోంది. నిజానిజాలు సుప్రీంకోర్టు ద్వారానే అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News