: బీరు తాగినందుకు రూ.30 వేల పరిహారం


సంతోషం కోసం ఫ్రెండ్ తో కలిసి బీరు తాగితే.. ఆస్పత్రి పాలయ్యాడు. తనకా పరిస్థితికి కారణమైన కంపెనీపై పోరాడి 30వేల రూపాయలు రాబట్టాడు తమిళనాడుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి. ఎప్పుడో 2012 జూన్ 16న తిరుపూర్ జిల్లా అవనాషిలో నాగరాజు, తన ఫ్రెండ్ తో కలిసి తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టీఏఎస్ఎమ్ఏసీ) కౌంటర్లో బీర్లు కొని తాగాడు. తాగేటప్పుడు బీరులోంచి నోటిలోకి వేలి గోరొకటి వచ్చింది. వేళ్లతో బయటకు తీసి చూసి పక్కన పారేసి పని కానిచ్చేశాడు.

మరుసటి రోజు అతడికి వాంతులు, కడుపులో నొప్పి. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. టీఏఎస్ఎమ్ఏసీ నిర్లక్ష్యం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశాడు. పరిహారంగా రూ. 1.50లక్షలు ఇప్పించాలని కోరాడు. వాదనలు విన్న అనంతరం జడ్జి దండపాణి నాగరాజుకు 30వేల రూపాయల పరిహారం ఇవ్వాలని టీఏఎస్ఎమ్ఏసీని ఆదేశించారు. కోర్టు ఖర్చుల కింద మరో వెయ్యి రూపాయలు కూడా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News