: ప్రపంచంలోనే పెద్ద వయసున్న కుటుంబం ఇదే


అది బ్రిటన్ లోని మిడిల్స్ బ్రాగ్. అక్కడొక కుటుంబం. తోడ బుట్టిన అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెళ్ల సంఖ్య 11. వారంతా 68 నుంచి 89 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారే. ఇప్పుడు ఈ బ్రూడెనెల్ కుటుంబమే ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసుగల కుటుంబంగా గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కబోతోంది.

అదెలా అంటే వీరందరి వయసు లెక్కించగా వచ్చే సంఖ్యే ప్రామాణికం. బ్రూడెనెల్ కుటుంబంలో ఐదుగురు సోదరులు, ఆరుగురు సోదరీమణులు ఉన్నారు. రాబర్ట్(68), జాన్(69), జీన్(71), మారియన్(74), జేమ్స్(76), విన్సెంట్(78), మే(79), మేరీ(80), వినిఫ్రెడ్(83), విలియమ్(88), బెర్న్ డెట్టే(89). వీరి వయసు కలిపితే 855 ఏళ్లు వస్తోంది. దీనిని ఆ కుటుంబం వయసుగా పరిగణిస్తారు. మరిప్పటి వరకు ఇలా గిన్నిస్ బుక్ లో ఉన్న అత్యంత వయసైన కుంటుంబం రికార్డు 828 సంవత్సరాలతోనే ఉంది. బ్రూడెనెల్ కుటుంబం వయసు దీనికంటే ఎక్కువే కనుక దరఖాస్తు చేసుకోమని గిన్నిస్ బుక్ వారు ఆహ్వానించారు. నిజానికి వీరి కుటుంబంలో తోడబుట్టిన వారి సంఖ్య 13, ఇద్దరు ఇప్పటికే కాలం చేశారు. వారూ ఉండి ఉంటే వీరి రికార్డును మరెవరూ బీట్ చేయలేరేమో.

  • Loading...

More Telugu News