: కుప్పకూలిన సైనిక విమానం.. 103 మంది మృత్యువాత
అల్జీరియా దేశంలో సైనిక రవాణా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 103 మంది దుర్మరణం పాలైనట్లు భావిస్తున్నారు. అల్జీరియా ఈశాన్య ప్రాంతంలోని పర్వతాల్లో ఈ విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహాయక చర్యలు చేపట్టేందుకు వైమానిక బృందాలు బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. కుప్పకూలిన విమానంలో ఉన్న వారందరూ సైనికులేనని సమాచారం అందింది.