: ఐపీఎల్-6 నుంచి కేపీ అవుట్


ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ రోమాంఛక బ్యాటింగ్ విన్యాసాలను ఐపీఎల్ తాజా సీజన్ లో మనం చూడలేకపోవచ్చు. ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్లో ఉన్న కేపీ మోకాలికి గాయమైందని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించే పీటర్సన్ కు టీ20 ఫార్మాట్లో విలువైన ఆటగాడనే పేరుంది. మోకాలిగాయం కారణంగా కేపీ న్యూజిలాండ్ తో శుక్రవారం మొదలయ్యే చివరి టెస్టుకు దూరమయ్యాడు. కివీస్ పర్యటన తొలినాళ్లలో నాలుగు రోజుల ప్రాక్టీసు మ్యాచ్ కు ముందు కేపీకి గాయమైంది. అయితే, తాజాగా గాయం తిరగబెట్టింది. 

ఈ పొడగరి బ్యాట్స్ మన్ మోకాలి చిప్ప భాగంలో మృదులాస్థి లోపించినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో, ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి అవసరమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో, వచ్చే నెల మొదటి వారంలో ఆరంభమయ్యే ఐపీఎల్-6లో కేపీ ఆడే అవకాశాలు దాదాపు లేనట్టే. 

  • Loading...

More Telugu News