: జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం


జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం ఇవాళ (మంగళవారం) ముఖ్యమంత్రిని కలిసింది. ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. అందుకు సీఎం సమ్మతించారని సంఘం తెలిపింది. దీంతో.. 2,262 జూనియర్ లెక్చరర్, 626 వొకేషనల్ అధ్యాపకుల భర్తీకి మార్గం సుగమమైందని అధ్యాపకుల సంఘం పేర్కొంది.

  • Loading...

More Telugu News