: ప్రజల పక్షాన నిలబడ్డాం.. బిల్లును అడ్డుకోవడమే మా లక్ష్యం: రాయపాటి
కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండైన ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడామని, అందుకే పార్టీ సస్పెండ్ చేసినా బాధపడేది లేదని రాయపాటి చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ తెలంగాణ బిల్లును ఆమోదిస్తే చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు గురించి మాట్లాడుతూ.. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఖాయమన్నారు. అయితే, ముందుగా లోక్ సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టే అంశంపై వేచి చూస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడమే తమ లక్ష్యమని రాయపాటి వెల్లడించారు. ఆ తరువాతే రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.