: పూనుగొండ్ల నుంచి మేడారానికి బయల్దేరిన పగిడిద్దరాజు
వరంగల్ జిల్లాలో జరుగుతోన్న మహా జాతరకు భక్తులు మేడారం బాట పట్టారు. బుధవారం నుంచి జాతర ప్రారంభమవుతుండగా.. ఇప్పటికే మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక జాతరకు ముందుగా జరిగే తంతు ఇప్పటికే ప్రారంభమైంది. గిరిజన సంప్రదాయాల మధ్య సమ్మక్క భర్త పగిడిద్దరాజును మేడారానికి తీసుకువస్తున్నారు.
ఈరోజు (మంగళవారం) కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామంలోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును తీసుకెళ్లారు. పగిడిద్దరాజు వంశీయులైన పెనుక వంశస్థులు పూనుగొండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పగిడిద్దరాజును పడగ రూపంలో అలంకరించి మేడారానికి తీసుకెళుతున్నారు. పూనుగొండ్ల అడవుల నుంచి కాలినడకన పగిడిద్దరాజుతో బయల్దేరిన పూజారులు బుధవారం రాత్రికి మేడారానికి చేరుకొంటారు.