: జగన్ అంటే బెంబేలెత్తిపోతున్నారు: జూపూడి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలవేనని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర రావు చెప్పుకొచ్చారు. అన్నదాతల పక్షాన జగన్ చేసిన పోరాటాల ఫలితంగానే సర్కారులో చలనమొచ్చిందన్నారు. జగన్ కు ప్రజల్లో వస్తోన్న, పెరుగుతోన్న ఆదరణను చూసి కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. అందుకోసమే హడావుడిగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో చర్చిచకుండానే వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం రాజ్యంగ విరుద్ధమని జూపూడి పేర్కొన్నారు.