: మేడారం జాతర ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభం
‘మేడారం జాతర’కు సంబంధించిన సమగ్ర సమాచారంతో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది. ఈ వెబ్ సైట్ ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు (మంగళవారం) సచివాలయంలో ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సోనియాగాంధీ నిలువెత్తు బరువు బంగారాన్ని (బెల్లం) మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.