: జేపీపై దాడికి నిరసనగా లోక్ సత్తా రాష్ట్ర వ్యాప్త నిరసనలు
లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై తెలంగాణ న్యాయవాదుల దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కటారి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ఆంధ్రాభవన్ సాక్షిగా జరిగిన దాడికి నిరసనగా సాయంత్రం 7 గంటలకు ట్యాంక్ బండ్ పై నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద లోక్ సత్తా ధర్నా చేపడుతుందని అన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు చేపడతామని కటారి తెలిపారు.