: ఉండవల్లి నివాసంలో సస్పెండైన ఎంపీల సమావేశం
కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన పార్లమెంటు సభ్యులు ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్, హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు హాజరయ్యారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడినందుకు.. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం సరికాదని వారు వ్యాఖ్యానించారు. తమ భవిష్యత్ కార్యాచరణపై వారు ఈ సమావేశంలో చర్చించనున్నారు.