: రాజధాని రైల్లో మంటలు


ఇటీవల కాలంలో రైళ్ళు అగ్నిప్రమాదాల బారిన పడుతుండడంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. తాజాగా, హౌరా-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు హౌరా స్టేషన్ వద్ద ప్లాట్ ఫామ్ పై నిలిచి ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. ట్రైన్ జనరేటర్ వ్యాన్ వద్ద మంటలు మొదలైనట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ నాలుగు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయి ఉన్నాయి. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News