: అవిశ్వాసం పెట్టారనే చర్యలు: డిగ్గీ రాజా
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినందుకే సీమాంధ్ర ఎంపీలపై చర్యలు చేపట్టామని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎంపీలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాకే వారిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. సభ్యులను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేసే అంశం స్పీకర్ పరిధిలోనిదని, అంతకుమించి దానిపై తాను వ్యాఖ్యానించలేనని డిగ్గీరాజా స్పష్టం చేష్టం చేశారు.