: 20 శాతం మంది భారతీయులు బకరాలేనట!
ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. ఆ ఫలితాలను అనుసరించి 20 శాతం మంది భారతీయులు బకరాలే అనిపించకమానదు. సర్వే వివరాల్లోకెళితే.. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సానుకూలతతోపాటు ప్రతికూలత కూడా చవిచూడాల్సి వస్తోంది. కొందరు దురాశ కారణంగానూ, మరికొందరు అమాయకత్వం కారణంగానూ మోసగాళ్ళ బుట్టలో పడిపోతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 10 వేల మంది వినియోగదారులపై సర్వే నిర్వహించిన మైక్రోసాఫ్ట్ అందులో 20 శాతం మంది భారతీయులు మోసగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నారని తెలిపింది. ఈ విషయమై మైక్రోసాఫ్ట్ ఇండియా నేషనల్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ, నేటి కాలంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, నెట్ లో మనకు అవసరాల మేరకే నడుచుకోవాలని, ఊరించే ప్రకటనలకు ప్రలోభపడి పిన్ నంబర్లు, ఐడీ వివరాలు తెలపడం సరికాదన్నారు.