: ఉస్మానియా ఆస్పత్రి తీరుపై కవిత ఆగ్రహం
ఉస్మానియా ఆస్పత్రి నిర్వహణ తీరుపై తెలంగాణ జగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. బడ్జెట్ లో కేటాయించిన 50కోట్ల నిధులు ఆస్పత్రి ఖాతాలోకి చేరకుండా దారిమళ్లాయని ఆమె ఆరోపించారు. ఆస్పత్రిలో సరైన సదుపాయాల్లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఉస్మానియా నర్సింగ్ కళాశాలను చంచల్ గూడకు తరలించటం మీదా కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి బడ్జెట్ కేటాయింపుల్లోనూ తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.