: జయప్రకాశ్ నారాయణకు మరో పరాభవం
జయప్రకాశ్ నారాయణకు తెలంగాణ సెగ తగిలింది. లోక్ సత్తా అధినేత మరోసారి చేదు అనుభవాన్ని మూటగట్టుకున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆయనపై దాడి జరిగితే, ఈసారి తెలంగాణ న్యాయవాదులు ఆయన చొక్కా పట్టుకున్నారు. ఇంతలో పోలీసులు కల్పించుకోవడంతో ఆయన మెడకున్న 'టై' వారి చేతిలో పడింది. దీంతో టైను పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర విభజన సామరస్యంగా ఎలా చేయవచ్చు? అనే అంశంపై ఢిల్లీలో జేపీ మాట్లాడుతుండగా, జై తెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆయనను చుట్టుముట్టారు. లోక్ సత్తా నేతలు ఎంత సర్దిచెప్పినప్పటికీ తెలంగాణ వాదులు వినలేదు. దీంతో జేపీకి చేదు అనుభవం మిగలకుండా పోలీసులు కంచెలా ఏర్పడి రక్షణ కల్పించారు.