: మహిళ కాముక చేష్టలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్


పాశ్చాత్య దేశాల్లో మానసిక ప్రకోపంతో బాధపడేవాళ్ళు ఎందరో కనిపిస్తారు. అలాంటి వాళ్ళకోసం అక్కడి ప్రభుత్వాలే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ సమస్య ఎంత తీవ్రమో. ఇక విషయం ఏమిటంటే.. అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బాల్టిమోర్ నుంచి వాషింగ్టన్ మీదుగా సాల్ట్ లేక్ సిటీ వెళ్ళాల్సి ఉంది. బాగా తాగి ఉన్న ఓ మహిళ కూడా విమానం ఎక్కింది. తన మానాన తాను కూర్చోకుండా, పక్క సీట్లో వ్యక్తిపై కాముక చేష్టలతో విరుచుకుపడింది. ఈ తాగుబోతు అమ్మడి శృంగార విన్యాసాలు భరించలేని ఆ ప్రయాణికుడు గగ్గోలు పెట్టాడు. ఓ దశలో తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని కూడా బెదిరించిందట ఈ కామపిశాచి. దీంతో ఆ ప్రయాణికుడు మరింత బెంబేలెత్తిపోయాడు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పైలెట్ విమానాన్ని మినియాపోలిస్ విమానాశ్రయంలో అత్యవసరంగా కిందికి దింపేయగా, భద్రత సిబ్బంది వచ్చి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News