: ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ గా సమాచార హక్కు కార్యకర్త రామకృష్ణ రాజు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో సమాచార హక్కుకు చెందిన యునైటెడ్ ఫోరమ్ కన్వీనర్ గా ప్రస్తుతం రామకృష్ణ రాజు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏఏపీకి విశేష జనాదరణ లభిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం చూపగలదన్న విశ్వాసం ఉందని ఏఏపీ ఈ ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి చెందిన అన్ని కార్యకలాపాలను ఈ కమిటీ సమన్వయపరుస్తుందని ఏఏపీ ఈరోజు (మంగళవారం) ప్రకటించింది.
రాష్ట్ర ప్రచార కమిటీలోని సభ్యులుగా.. విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఆర్.వెంకటరెడ్డి, సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ జస్వీన్ జైరథ్, విస్సా కిరణ్ కుమార్, వీధి వ్యాపారుల సమాఖ్యకు చెందిన సయ్యద్ బిలాల్, దళిత ఉద్యమకారుడు విజయ్ కుమార్, హైకోర్టు లాయర్ రవిచంద్ర ఉన్నారు.