: ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా ఇదే..
ఎన్నాళ్ళ నుంచో పేలవ ఫామ్ తో నెట్టుకొస్తున్న సురేశ్ రైనాపై వేటు పడింది. ఆసియా కప్ కు ఎంపిక చేసిన టీమిండియాలో రైనాకు చోటు దక్కలేదు. బెంగళూరులో నేడు సమావేశమైన జాతీయ సెలెక్టర్లు ఆసియా కప్ తోపాటు టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేశారు. ఇటీవల కాలంలో తన అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్న ఛటేశ్వర్ పుజారాకు ఆసియా కప్ స్క్వాడ్ లో బెర్తు దక్కింది. ఆశ్చర్యకరంగా పేసర్ ఇషాంత్ శర్మకు రెండు జట్లలోనూ చోటు దక్కలేదు. ఇటీవల కాలంలో కాస్తోకూస్తో రాణిస్తున్న సీనియర్ పేసర్ ఇషాంత్ ఒక్కడే.
నేడు ఎంపిక చేసిన జట్లు ఇవే..
ఆసియా కప్: ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), ధావన్, రోహిత్, కోహ్లీ, పుజారా, రాయుడు, రహానే, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమి, ఆరోన్, బిన్నీ, అమిత్ మిశ్రా, ఈశ్వర్ పాండే
టి20 వరల్డ్ కప్: ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), ధావన్, రోహిత్, కోహ్లీ, రైనా, యువరాజ్, రహానే, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమి, బిన్నీ, అమిత్ మిశ్రా, ఆరోన్, మోహిత్ శర్మ.