: కాంగ్రెస్ పార్టీకి అద్వానీ షాక్


తెలంగాణ బిల్లును గట్టెక్కించేందుకు బీజేపీపై భారీగా ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అగ్రనేత అద్వానీ షాకిచ్చారు. తెలంగాణ బిల్లుకు మద్దతివ్వలేమని అద్వానీ స్పష్టం చేశారు. బీఎసీ అసలు ఎజెండాలో తెలంగాణ విషయం లేదని, టేబుల్ ఐటెంగా సర్క్యులేట్ చేశారని టీడీపీ నేతలు అద్వానీకి వివరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, అయితే కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపలేమని, తప్పుల తడకగా ఉన్న బిల్లుకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ నేతలకు అద్వానీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News