: కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకరనుకోవడం అవివేకం: బొత్స
రాజకీయ లబ్ధి కోసం కొంత మంది కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటున్నారని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వీరు పోయినంత మాత్రాన కాంగ్రెస్ కు సరైన అభ్యర్థులు దొరకరనుకోవడం అవివేకమే అవుతుందని చెప్పారు. పార్లమెంటులో విభజన బిల్లును అడ్డుకోవాలని సీమాంధ్ర ఎంపీలు ముందే అనుకున్నారని... అందువల్ల వారిని పార్టీ నుంచి బహిష్కరించినా, బిల్లును అడ్డుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు.