: సమస్యపై పోరాడడమే తప్పా: మోదుగుల
సమస్యలపై పోరాడడమే తప్పా? అని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలపై పోరాడిన ఎంపీలను ఎలా బహిష్కరిస్తుందని నిలదీశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమైనా ప్రజాసంబంధ వ్యవహారం కనుక స్పందిస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈ నిర్ణయంతో మరింత పట్టుదలతో పోరాడుతారని తాను భావిస్తున్నానని మోదుగుల అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన నిలిస్తే ఎవరి భవిష్యత్ ఏంటో వారే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.