: బీజేపీ నేతలను కలిశాం.. కాంగ్రెస్ పార్టీ తీరును వారు వెల్లడించారు: ఎర్రబెల్లి


కాంగ్రెస్ పార్టీ ఈ దశలో కూడా నాటకాలాడుతోందని తెలంగణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఎల్ కే అద్వానీ తెలిపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడే దోషి అని చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారని ఎర్రబెల్లి తెలిపారు. తమ నేత రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని సూచిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును టీడీపీ స్వాగతిస్తోంది కానీ, రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన రీతిలో విభజన జరగాలని సూచిస్తోందని ఆయన తమ పార్టీ అధినేతను వెనకేసుకొచ్చారు.

  • Loading...

More Telugu News