: కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర భేటీ


కాంగ్రెస్ కోర్ కమిటీ నేటి సాయంత్రం నాలుగు గంటలకు అత్యవసరంగా భేటీ కానుంది. తెలంగాణ బిల్లు అంశం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తుండడంతో సీడబ్ల్యూసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో తెలంగాణ బిల్లు ఆర్థిక బిల్లా, లేక సాధారణ బిల్లా అనే విషయంపై చర్చించనున్నారు. సీడబ్ల్యూసీ భేటీలో తెలంగాణ బిల్లు ఆర్థిక బిల్లు కాదని, సాధారణ బిల్లు అనే విషయంపై ఆర్థికమంత్రి చిదంబరం వాదించనున్నారు. కాగా సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ పై సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News