: రాష్ట్రం నాశనం కాకూడదనే వారిద్దరితో మాట్లాడాను: వెంకయ్యనాయుడు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడే ఉన్నామని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది మానేసి తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిజాయతీని శంకించాల్సిన పని లేదని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు ఆందోళన చేందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. జైరాం రమేష్ తో కానీ, అహ్మద్ పటేల్ తో కానీ మాట్లాడవలసిన అవసరం లేదని. రాష్ట్రం అన్యాయమైపోతుందని, కల్పించుకోవాలని కొందరు మిత్రులు సూచించడంతో వారు వస్తే మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు.

జరుగుతున్న పరిణామాలన్నీ దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ మంచివి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాల నేతలతో సమావేశమై సమన్వయం చేసి సక్రమ మార్గంలో నడిపించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులు కూడా ఫ్లకార్డులు పట్టుకున్నారని ఆయన తెలిపారు. సిగ్గూ, శరం ఉంటే ముందు మీ పార్టీని అదుపు చేసుకుని ఆ తరువాత బీజేపీపై వ్యాఖ్యలు చేయండి అని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News