: సస్పెన్షన్ పై సమాచారం లేదు.. వచ్చాక దీటైన సమాధానం చెబుతా: లగడపాటి


కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. తమను పార్టీ నుంచి సస్పెండ్ చేయగలరు కానీ, పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయలేరని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లగడపాటి మాట్లాడుతూ, తాము అన్నింటికీ సిద్ధపడే అవిశ్వాస తీర్మానం ఇచ్చామని, ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తాము ముందే ఊహించామని అన్నారు. పదవులు పోయినా తమకు బాధ లేదని, విభజనను అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. తనకు సస్పెన్షన్ పై సమాచారం అందలేదని, అందాక సాయంత్రం సస్పెన్షన్ కు దీటైన సమాధానం ఇస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News