: పోలీసులపై ఓయూ విద్యార్థుల రాళ్లదాడి
ఉస్మానియా యూనివర్శిటీలో ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేపటి సడక్ బంద్ విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థులు ర్యాలీ తీయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు క్యాంపస్ లోకి వచ్చిన పోలీసులపై ఓయూ విద్యార్థులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి తలకి తీవ్రగాయమైంది. రక్తమోడుతోన్న పోలీస్ అధికారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.