: లోక్ సభ, రాజ్యసభల్లో హోరెత్తిన సమైక్యాంధ్ర నినాదాలు
వాయిదా తరువాత ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభలు సమైక్య నినాదాలతో హోరెత్తిపోయాయి. రాజ్యసభ, లోక్ సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఛైర్మన్, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. వీరికి తమిళ నేతలు జతకలవడంతో సభలు రెండు రసాభాసగా మారాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ స్థానాల్లోనే నిలబడి నిరసన తెలుపుతున్నారు.