: ఉస్మానియా వర్శిటీలో ఉద్రిక్తత


ఉస్మానియా యూనివర్శిటీలో ఇవాళ (మంగళవారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ కావాలంటూ విద్యార్థులు ర్యాలీగా బయల్దేరారు. విద్యార్థుల ర్యాలీని ఎన్.సి.సి.గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు ఎన్.సి.సి.గేట్ వద్దే బైఠాయించి తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ అంశంపై బీజేపీ జాతీయ నేతలు ఎల్.కె.అద్వానీ, వెంకయ్యనాయుడు వైఖరికి నిరసనగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. భద్రాచలాన్ని సీమాంధ్ర ప్రాంతంలో కలపవద్దని వారు నినాదాలు చేశారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు నిలువరిస్తున్నా.. బారికేడ్లు దాటుకొని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దాంతో ఉస్మానియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News