: సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర భేటీ
కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సాయంత్రం అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడంపై కొనసాగుతున్న ఉత్కంఠ, బిల్లును పెట్టకుండా సభలో పార్టీ ఎంపీలు అడ్డుకుంటున్న తీరు, ఇతర విషయాలపై కమిటీ చర్చించనుందని సమాచారం.