: సిటీ బస్సులో మంటలు..తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్టణంలోని ఐఎన్ఎస్ సాముద్రిక ఆడిటోరియం వద్ద సిటీబస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు బస్సులోంచి దూకి పరుగులంకించుకున్నారు. అక్కడే ఉన్న నేవీ సిబ్బంది అప్రమత్తమై బస్సులో చెలరేగిన మంటలను స్థానికుల సాయంతో ఫైరింజన్ లు చేరుకునే లోపే ఆర్పేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే సహజవాయువు సరఫరా చేసే లైన్లు ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.