: తక్కువ ధరలో నోకియా నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్
ఇప్పటి వరకు విండోస్ ఫోన్లకే పరిమితమైన నోకియా.. ఇకపై ప్రత్యర్థి గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను నమ్ముకొని అమ్ముకోనుంది. ఎక్కువ మంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల వినియోగానికే ఆసక్తి చూపుతున్నందున నోకియా తన రూట్ మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో, పరిమిత ఫీచర్లతో నోకియా తన తొలి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ను ఈ నెల చివర్లో బార్సెలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఆవిష్కరించనుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అమ్మడుపోతున్న స్మార్ట్ ఫోన్లలో 79 శాతం ఆండ్రాయిడ్ వి కాగా, 15 శాతం యాపిల్ ఐఓఎస్, 4 శాతం విండోస్ వి ఉంటున్నాయి.