: దోషిగా తేలితే రాజస్థాన్ రాయల్స్ లో షేర్లు ఇస్తా: రాజ్ కుంద్రా
ఐపీఎల్ కుంభకోణం వ్యవహారంలో రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై కొంత విచారణ జరగాల్సిన అవసరం ఉందని నిన్న (సోమవారం) సమర్పించిన నివేదికలో జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ పేర్కొంది. వెంటనే దానిపై స్పందించిన రాజ్ కుంద్రా, బెట్టింగ్ వ్యవహారంలో తనకు, తన భార్య శిల్పా శెట్టికి ఎలాంటి ప్రమేయం లేదని ఖండించారు. అయితే, విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. స్కాంలో ఒకవేళ తాను దోషిగా తేలితే రాజస్థాన్ రాయల్స్ లో షేర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కుంద్రా చెప్పారు.