: వధువే తాళి కడితే!


హిందూ ధర్మంలో వరుడు వధువు మెడలో తాళి కడతాడు. దీనికి రివర్స్ లో వధువే వరుడి మెళ్లో తాళి కడితే? తమిళనాడులో ఒక తుంటరి చలాకీ వధువు ఇలానే చేసింది. తిరువాయూరుకు చెందిన వాసంతి, శ్రీరంగానికి చెందిన సతీష్ కుమార్ కు పెద్దలు వివాహం నిశ్చయించారు. సుముహూర్తం రానే వచ్చింది. వరుడే వధువు మెళ్లో తాళి కట్టి వేద మంత్రాల సాక్షిగా అర్ధాంగిగా స్వీకరించాడు. కానీ, ఆ తర్వాతే సీన్ మారిపోయింది. భోజనాలు పూర్తయ్యాక వాసంతి అందరి సమక్షంలో చటుక్కున తాళిబొట్టు తీసి సతీష్ కుమార్ మెళ్లో చిటుక్కున కట్టేసింది. ఇదేం విడ్డూరమని కొందరు అనుకుంటే.. భలే పని చేసిందిలే అని కొందరు అనుకున్నారట. మరి వాసంతి అలా చేయడానికి కారణం ఏమిటంటే.. స్త్రీ, పురుషులు సమానమే కదా అన్న ఫిలాసఫీ.

  • Loading...

More Telugu News