: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తెల్లవారు జామున బ్యాంకాక్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో ఇద్దరు వ్యక్తులు ఎయిర్ పోర్టు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వెంటనే అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలోనే వారి నుంచి కేజీకుపైగా బంగారాన్ని తీసుకున్నారు. తర్వాత ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించి తదనంతర విచారణ చేపట్టారు.