: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘కృషి కర్మన్ అవార్డు’


2012-13 ఆర్థిక సంవత్సరంలో ముతక ధాన్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానం సాధించినందుకు గానూ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ‘కృషి కర్మన్ అవార్డు’ను ప్రదానం చేసింది. ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్ రావు ఈ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డుతో పాటు కోటి రూపాయల నగదును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో అధిక ఉత్పత్తి సాధించి ఇద్దరు రైతులకు లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేశారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో త్వరలో చిరుధాన్యాల ప్రజల ఆరోగ్య రక్షణకు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు.

రాష్ట్రంలో ముతక ధాన్యాలైన రాగులు, సజ్జలు, మొక్కజొన్న, జొన్నలు, కొర్రలు తదితర చిరు ధాన్యాల ఉత్పత్తి ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. 2012-13 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 9.72 లక్షల ఎకరాలలో సాగు చేయగా.. 48. 13 లక్షల టన్నుల దిగుబడవి వచ్చింది. వీటిలో అత్యధిక విస్తీర్ణంలో.. 2.87 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంతో 5.18 లక్షల టన్నుల రాగులను పండించడం జరిగిందని అధికారిక సమాచారం.

  • Loading...

More Telugu News